నయనతార పెళ్లికి ముందు... నయన పెళ్లెప్పుడు, పెళ్లెప్పుడూ అంటూ ఒకటే ఆరాలు తీసింది తమిళ మీడియా. నయన పెళ్లి గురించి మీడియాలో రాని కథనం లేదు. అయితే ఇప్పుడు నయన పెళ్లయిపోయింది. తన ప్రియుడు విఘ్నేశ్ శివన్ ని పెళ్లి చేసుకొని హాయిగా కాపురం చేస్తోంది. అందుకే ఇప్పుడు నయన గర్భవతి అంటూ మళ్లీ వార్తలు వండి వార్చడం మొదలెట్టింది తమిళ మీడియా. రెండ్రోజులగా తమిళ నాట నయన గర్భవతి అనే వార్త హల్ చల్ చేస్తోంది. నయన ఇటీవల ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకొంది. దానికి కారణం. ఆగకుండా వాంతులు అవ్వడమే. నయనకు వాంతులు అనగానే.. ఇక అది గర్భమే అని తమిళ మీడియా క్లారిఫై తెచ్చేసుకొంది. అందుకే వార్తలు మొదలెట్టింది.
చివరికి తేలిందేమిటంటే... నయన వాంతులతో ఆసుపత్రికి వెళ్లిన సంగతి నిజమే. అయితే అంత మాత్రాన గర్భవతి అనుకోవడమేనా? ఫుడ్ పాయిజన్‌తో నయన ఆసుపత్రికి వెళ్లిందని, విఘ్నేశ చేతి వంట తిని.. నయన వాంతులు చేసుకొందని, అందుకే ఆసుపత్రికి వెళ్లాల్సివచ్చిందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో.. నయన గర్భవతి అనే మాటర్ ఇప్పుడు తమిళనాట పెద్ద జోక్ గా మారిపోయింది.