బాహుబలి రెండు భాగాలొచ్చింది. కేజీఎఫ్ కూడా రెండు పార్టులే. పుష్ఫ పార్ట్ 2 పట్టాలెక్కబోతోంది.సలార్ నీ రెండు భాగాలుగా తీస్తున్నాడు ప్రశాంత్ నీల్. అయితే మిగిలిన సినిమాలకూ `సలార్`కూ ఓ తేడా ఉంది. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప ... రెండో భాగం చాలా ఆలస్యమయ్యాయి. సలార్ విషయంలో మాత్రం ఈ లేట్ ఉండకూడదని ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడు. అందుకే పార్ట్ 1, 2 లను ఒకేసారి తెరకెక్కించి, ఆ తరవాత ఒక దాని తరవాత మరోటి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
ఈ యేడాది చివరి నాటికి.. సలార్ పార్ట్ 1, పార్ట్ 2 రెండూ పూర్తవుతాయి. 2023 వేసవిలో.. సలార్ 1 వస్తుంది. సరిగ్గా ఆరు నెలలకు అంటే 2023 డిసెంబరులో సలార్ 2 విడుదల చేస్తారు. నిజానికి సలార్ 1 బయటకు వచ్చాక.. దాని రిజల్ట్ ని బట్టి పార్ట్ 2 చేద్దామనుకొన్నారు. కానీ ఈ ప్రాజెక్టుపై నమ్మకం ఉంచిన ప్రభాస్... రెండు భాగాల్నీ ఒకేసారి పూర్తి చేయమని, ఆ తరవాత ఒకదాని తరవాత మరోటి విడుదల చేయాలని సూచించాడట.
ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక అడ్డేముంది? అందుకే ప్రశాంత్ నీల్.... తాయితీగా రెండు భాగాల్నీ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు. అంటే 2023లో ప్రభాస్ సినిమాలు ఏకంగా మూడు విడుదల కాబోతున్నాయి. సలార్ రెండు భాగాలతో పాటుగా... ఆది పురుష్ కూడా 2023లోనే రాబోతోంది. సో.. ప్రభాస్ ఫ్యాన్స్ కి 2023లో పండగే అన్నమాట.