సైరాలో చిరంజీవి - నయనతార జోడీగా కనిపించారు. వాళ్లిద్దరూ కలిసి నటించడం అదే తొలిసారి. `లూసీఫర్` రీమేక్‌లో మరోసారి వీరిద్దరూ జంటగా కనిపించనున్నారన్న టాక్ వినిపించింది. మోహన్ రాజా ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే అధికారికంగా ఈ సినిమా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలు కానుంది.
అయితే.. ఈసినిమాలో నటించడానికి నయనతార `నో` చెప్పిందని సమాచారం. లూసీఫర్ కథ.. నయన దగ్గరకు వెళ్లిన మాట వాస్తవమే అని, అయితే.. నయన మాత్రం ఈ సినిమా చేయడానికి అంగీకరించలేదని టాలీవుడ్ టాక్. నయన ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉందని, తెలుగులో సినిమాలు చేయడానికి తన దగ్గర టైమ్ లేదని తెలుస్తోంది. ఆ కారణంతోనే.. ఈ సినిమాపై సంతకాలు చేయలేదని సమాచారం. నిజానికి తమిళ వెర్షన్లో కథానాయకుడి పక్కన నాయిక పాత్రలేదు.
తెలుగులో చిరు పక్కన హీరోయిన్ లేకపోతే,... అభిమానులు హర్ట్ అవుతారు. సినిమాపై అది నెగిటీవ్ ప్రభావాన్ని చూపించే ప్రమాదం ఉంది. అందుకే... ఆ ప్రమాదం లేకుండా హీరోయిన్ పాత్రని జోడించారు. నయన అయితే బాగుంటుందనుకుంటే.. ఇప్పుడు తను నో చెప్పింది. అందుకే చిత్రబృందం మరో స్టార్ హీరోయిన్ వేటలో ఉందని తెలుస్తోంది.