ఫ్యాన్స్ మధ్యలోనే బేధాభిప్రాయాలు కానీ, హీరోలు, హీరోయిన్ల మధ్య ఎప్పుడూ స్నేహ సంబంధాలే ఉంటాయి అని మన హీరోలు, హీరోయిన్లు చాలా సార్లు ప్రూవ్ చేశారు. ఈ నిజాన్ని ఎప్పటికీ గ్రహించని ఫ్యాన్స్ మాత్రం అవకాశం దొరికితే చాలు వారి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. అనవసరపు గాసిప్స్ సృస్టిస్తుంటారు. తాజాగా ఇలా చిచ్చు పెట్టే గాసిప్స్ ఇద్దరు హీరోయిన్స్ మధ్య పుట్టుకొచ్చాయి. వారెవరో కాదు, టాలీవుడ్, కోలీవుడ్స్‌లో స్టార్స్‌గా చెలామణీ అవుతోన్న ముద్దుగుమ్మలు నయన తార, సమంత.
వీరిద్దరూ కలిసి ఇప్పుడు ఓ సినిమా కోసం స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారన్న సంగతి తెలిసిందే. నయన్ బోయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతోంది. అయితే, ఈ సినిమాలో తమ తమ క్యారెక్టర్స్ నిడివి విషయంలో వీరిద్దరి మధ్యా గొడలు జరుగుతున్నాయంటూ గత కొంతకాలంగా రూమర్స్ పుడుతున్నాయి. ఈ గొడలు చిలికి చిలికి గాలివానగా మారి, ఈ సినిమా నుండి సమంత తప్పుకునేలా చేశాయంటూ, తాజాగా మరో గాసిప్ తెరపైకి వచ్చింది.
అయితే, మా మధ్య ఎలాంటి గొడవలు లేవ్.. ఈ సినిమాలో నటించేందుకు నేను చాలా క్యూరియాసిటీతో ఉన్నా.. అంటూ ఇటీవల సామ్ సోషల్ మీడియాలో తెలిపినా, ఈ గాసిప్ దారులు పుట్టించే గాసిప్స్ మాత్రం ఎప్పటికప్పుడే ఫ్రెష్ ఫ్రెష్‌గా ఊరిస్తూనే ఉన్నాయి. అంతేగా.. బాగున్నాం అన్నదాని మీద కన్నా, డిష్యూం.. డిష్యూం అన్నదానికే ఎక్కువ క్యూరియాసిటీ ఉంటున్న రోజులివి. ఏం చేస్తాం కలికాలం.