ముద్దుగుమ్మ నయనతారకు ఆల్రెడీ పెళ్లయిపోయిందని గాసిప్స్ గతంలోనే వచ్చాయి. వాటిని నయనతార ఖండించలేదూ. అసలు వాటిపై స్పందించనూ లేదు అప్పటి నుండి ఇప్పటి వరకూ నయనతార. తాజాగా మరోసారి నయనతార పెళ్లిపై గాసిప్స్ వస్తున్నాయి. మార్చి ఫస్ట్ వీక్‌లో నయనతార పెళ్లి జరగుతుందట. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి జరగనుందనీ ప్రచారం జరగుతోంది. గత కొంత కాలంగా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. పెళ్లి విషయమై తమకు అత్యంత సన్నిహితులైన సినీ ప్రముఖులకు ఈ ఇద్దరూ సమాచారమ్ ఇచ్చారట.ఇది తాజా సమాచారమ్.
ఈ గాసిప్ వినిపిస్తుండడంపై నయనతార అభిమానుల్లో ఆశక్తి నెలకొంది. అయితే ఇదెంత వరకూ నిజమో తెలీదు. గతంలో శింబుతో నయనతార ప్రేమాయణం పెళ్లి పీటలెకక్కకుడండానే గల్లంతయ్యింది. ఆ తర్వాత నయనతార - ప్రభుదేవా ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. పెళ్లి పీటలదాకా చేరిన వీరి ప్రేమాయణానికి, ప్రభుదేవా భార్య అడ్డంకి కావడంతో అప్పట్లో వీరిద్దరి పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు విఘ్నేష్ శివన్‌తో పెళ్లి అనే గాసిప్స్‌లో నిజమెంతో తెలీదు. కానీ గత కొంత కాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు.అదయితే కన్‌ఫామ్.
నయనతార సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. సౌత్‌లో అత్యంత పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ కూడా ఆమెనే. చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది నయనతార ప్రస్తుతం. అయితే ఇప్పుడు ఈ పెళ్లి గాసిప్స్ ఆమె కెరీర్‌ని ఎలా టర్న్ చేస్తాయో చూడాలి మరి. తెలుగులో నయనతార బిగ్ ప్రాజెక్ట్ అయిన 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో నటిస్తోంది.