ఒక ఫేమ్ వచ్చాక ఏం మాట్లాడినా చెల్లిపోతుందనుకుంటారో ఏమో.. ముద్దుగుమ్మలు ఒక్కోసారి నోరు జారేస్తుంటారు. తాజాగా ముద్దుగుమ్మ నయనతార కూడా అలాగే నోరు జారేసింది. 'గజినీ' సినిమాతో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన నయనతార తర్వాత తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతో స్టార్‌డమ్ సంపాదించుకుంది. సౌత్ క్వీన్‌గా అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటోన్న టాప్ 3 హీరోయిన్లలో నయన్ ఒకరుగా రాణిస్తోంది.
అయితే లేటెస్ట్‌గా నయనతార సంచలన వ్యాఖ్యలు చేసింది. తొలి సినిమాకి 'గజినీ'ని ఎంచుకోవడం సరైన నిర్ణయం కాదని ఆమె అభిప్రాయపడింది. అయితే కెరీర్ తొలినాళ్లలోనే మురుగదాస్ వంటి స్టార్ డైరెక్టర్‌తో ఛాన్స్ దక్కించుకోవడమంటే ఆషా మాషీ విషయం కాదు. అలాంటిది ఆ ఛాన్స్ అప్పట్లో నయన్‌కి దక్కింది. అయితే ఆ సినిమాలో హీరోయిన్ తాను కాదనీ, అసిన్ అనీ, అసిన్‌కి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ ఇచ్చి, ఏ మాత్రమూ ప్రాధాన్యత లేని పాత్ర తనకిచ్చారనీ, అందులోనూ తన సీన్స్ చాలా వరకూ ఎడిటింగ్‌లో లేపేశారనీ నయన్ అభిప్రాయపడింది. అప్పుడెప్పుడో జరిగిపోయిన ఇష్యూని నయన్ ఇప్పుడెందుకు తలచుకుందో తెలీదు కానీ, ప్రస్తుతం నయన్ ఏం మాట్లాడినా చెల్లిపోతుందంతే.
తెలుగులోనూ, తమిళంలోనూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది నయనతార. నయన్ ఊ అనాలే కానీ, స్టార్ హీరోలు సైతం ఆమెని తమ సినిమాల్లో హీరోయిన్‌గా పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది నయనతార. నయన్ డేట్స్ దొరకడం అంత తేలికైన విషయమే కాదిప్పుడు.