కత్తి భామ 'వీర లెవల్‌' పర్‌ఫామెన్స్‌!

మరిన్ని వార్తలు

తమిళ హీరో విశాల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా 'అయోగ్య'. తెలుగులో ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన 'టెంపర్‌'కి తమిళ రీమేక్‌గా తెరకెక్కింది ఈ 'అయోగ్య'. ఇటీవల విడుదలైన 'అయోగ్య' ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో అప్‌డేట్‌ బయటికి వచ్చింది. ఈ సినిమాకి స్పెషల్‌ సాంగ్‌ మరో స్పెషల్‌ అట్రాక్షన్‌. తెలుగులో 'వైజాగ్‌ సన్నీలియోన్‌' అంటూ బాలీవుడ్‌ బ్యూటీ నోరా ఫతేహితో ఇరగదీసే స్టెప్పులేయించేశారు డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌.

 

ఇక ఈ తాజా రీమేక్‌ లోనూ అదిరిపోయే ఐటెం సాంగ్‌ ఉందట. 'వీర లెవల్‌' అంటూ సాగే ఈ స్పెషల్‌ సాంగ్‌లో పర్‌ఫామ్‌ చేసిన బ్యూటీ ఎవరో తెలుసా.? కళ్యాణ్‌రామ్‌తో 'కత్తి' సినిమాలో నటించిన ముద్దుగుమ్మ సనాఖాన్‌. ఈ మధ్య సనాఖాన్‌ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. చాలా కాలం తర్వాత విశాల్‌ సరసన ఇదిగో 'అయోగ్య'లో ఇలా స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది. నోరా ఫతేహిలానే సనాఖాన్‌ కూడా మంచి డాన్సర్‌. ఇక మాస్‌ స్టెప్పులేయడంలో విశాల్‌ ఆయనకి ఆయనే సాటి. ఈ ఇద్దరూ కలిసి 'వీర లెవల్‌' సాంగ్‌కి మహావీర లెవల్‌లో పర్‌ఫామెన్స్‌ ఇచ్చేశారట.

 

మరో మూడు రోజుల్లో అంటే మే 10న 'అయోగ్య'ను వరల్డ్‌ వైడ్‌గా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాలో విశాల్‌కి జోడీగా రాశీఖన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 'టెంపర్‌'తో ఎన్టీఆర్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టాడు. ఇటీవల 'పందెంకోడి 2'తో ఆశించిన రిజల్ట్‌ అందుకోకపోయినా, విశాల్‌ 'అయోగ్య'తో బంపర్‌ హిట్‌ కొట్టడం ఖాయమంటున్నారు తమిళ తంబీలు. చూడాలి మరి 'అయోగ్య'తో ఆ హిట్‌ యోగం విశాల్‌కి ఉందో లేదో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS