కాంట్రవర్సీ ఎక్కడుంటే అక్కడ రెక్కలు కట్టుకుని వాలిపోతుంటుంది హాట్ ఐటెం రాఖీ సావంత్. తాజాగా ఈ హాటీ ఓ వివాదంతో వార్తల్లో నిలిచింది. పాకిస్థాన్ జెండా పట్టుకుని ఉన్న ఓ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రాఖీ సావంత్. నెటిజన్లు ఊరుకుంటారా.? పాకిస్థాన్ అంటేనే ఉగ్రవాదం గుర్తొస్తుంది. అందుకే ఆ పేరెత్తితేనే అంత ఎత్తున లేస్తారు మన ఇండియన్లు. ఒక ఇండియన్‌గా అలా రెస్పాండ్ అవ్వడం మన బాధ్యత.
40 మందికి పైగా ఇండియన్ జవాన్లను పొట్టన పెట్టుకుంది ఇటీవల పుల్వామా ఉగ్రదాడిలో పాకిస్థాన్. అలాంటిది మన ఇండియన్ యాక్ట్రెస్ అయిన రాఖీ సావంత్‌ని ఇలా చూస్తే ఊరికే ఎందుకు ఊరుకుంటారు చెప్పండి. తమదైన శైలిలో ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. అయితే, రాఖీ సావంత్ పాకిస్థాన్ జెండా ఎందుకు పట్టుకున్నట్లు.? అంటే, రాఖీ సావంత్ తాజాగా నటిస్తున్న ఓ సినిమాలో పాకిస్థానీ యువతి పాత్ర పోషిస్తోంది. ఆ సినిమాలోనిదే ఈ స్టిల్ అన్నమాట. ఇకపోతే ఈ ఫోటోపై వస్తున్న కామెంట్స్‌కి రాఖీ సావంత్ రెస్పాండ్ అయ్యింది.
పాకిస్థాన్‌లో ఉన్నవాళ్లంతా ఉగ్రవాదులే కాదు. మనలాంటి మనుషులు కూడా ఉంటారు అక్కడ. ఎవరో కొందరు ఉగ్రవాదుల నుండి, అక్కడున్నవాళ్లంతా మనుషులు కాదు, ఉగ్రవాదులే అని అనడం సబబు కాదు.. అంటే హాట్ హాట్‌గా లెక్చర్లు ఇచ్చేస్తోంది. అయితే, రాఖీ లెక్చర్లు ఎవరు వింటారు చెప్పండి.