ఈ స్టార్‌ హీరోయిన్‌ని గుర్తుపట్టలేం.!

By iQlikMovies - January 09, 2019 - 11:30 AM IST

మరిన్ని వార్తలు

నిన్న మొన్నటిదాకా కమర్షియల్‌ మూవీస్‌కే మొగ్గు చూపే హీరోయిన్లు ఇప్పుడు రూటు మార్చేశారు. స్టార్‌డమ్‌ దక్కించుకున్నాక ఇక విలక్షణ చిత్రాలపై దృష్టి పెడుతున్నారు. హీరోలేనా ప్రయోగాలు చేసేది మేం కూడా చేస్తామని ముందుకొస్తున్నారు. ఆ కోవలో టాలీవుడ్‌ నుండి మొదటి ప్లేస్‌ అనుష్క అయితే, సౌత్‌ క్వీన్‌ నయనతార అంతకు ఏమాత్రం తక్కువ కాదు. తమిళంలో ఆమె నుండి ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలొచ్చాయి. 

 

తాజాగా మరో ప్రయోగానికి నయన్‌ రెడీ అవుతోంది. ఓ సినిమా కోసం డీ గ్లామర్‌ రోల్‌లో కనిపించబోతోంది. డీ గ్లామర్‌ అంటే కేవలం మేకప్‌ లేకుండానే కాదు, తన స్కిన్‌ టోన్‌ని పూర్తిగా మార్చేసుకోని అసలు గుర్తుపట్టలేనంగా మారిపోయేలా అన్నమాట. అంటే ఓ సినిమా కోసం నయనతార ఛామన ఛాయలోకి మారిపోనుందట. ఛామన ఛాయ అంటే దాదాపు నలుపు రంగులోకేనట. 

 

'ఐరా' అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఓ సినిమాలో నయనతార డిఫరెంట్‌ వేరియేషన్స్‌ ఉన్న రెండు పాత్రలు పోషించనుందట. వాటిలో ఒక పాత్ర కోసం తన రూపాన్ని అలా మార్చేసుకోనుందట. రూపం నలుపు అయినా, ఈ అమ్మాయి పాత్ర ను చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్‌ చేశారట డైరెక్టర్‌. ఈ పాత్రకు సంబంధించి ఓ లుక్‌ ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. నయన్‌ ఇది నువ్వేనా.? అని అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది ఆ లుక్‌. ఇకపోతే తెలుగులో మెగాస్టార్‌తో 'సైరా'మూవీలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS