నజ్రియా.. అప్పుడెప్పుడో చెయ్యాల్సింది.!

మరిన్ని వార్తలు

‘అంటే.. సుందరానికీ..’ అంటూ నాని సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘నెవర్‌ బిఫోర్‌..’ అనేలా ఈ సినిమా వుండబోతోందట. ఇక, ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం హీరోయిన్‌ నజ్రియా. పలు తమిళ సినిమాల్లో నటించిన ఈ క్యూట్‌ బ్యూటీ, కొన్ని డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. నయనతార, ఆర్య జంటగా నటించిన ఓ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరించేసింది. అయితే, ఆ సినిమా తర్వాత టాలీవుడ్‌ నుంచి కూడా నజ్రియాకి అవకాశాలు వచ్చాయిగానీ, ఎందుకో ఆమె సినిమా కెరీర్‌ పట్ల అంతగా ఆసక్తి చూపకుండా, ఎంచక్కా పెళ్ళి చేసుకుని లైఫ్‌లో సెటిలైపోయింది. మళ్ళీ ఏమనుకుందో, పెళ్ళయ్యాక తిరిగి సినిమాలపై ఆసక్తి ప్రదర్శించింది. సరిగ్గా ఈ సమయంలోనే ఆమెకు బంపర్‌ ఆఫర్‌ వచ్చిందన్నమాట ‘అంటే.. సుందరానికీ..’ అనే సినిమాతో.


ట్రెండ్‌ మారింది.. పెళ్ళయ్యాక సినిమా ఛాన్సులు హీరోయిన్లకు రావని ఎవరన్నారు.? పెళ్ళయ్యాక రెట్టించిన జోష్‌తో కెరీర్‌ని అదరగొట్టేస్తున్నారు చాలామంది భామలు. ఆ లిస్ట్‌లో నజ్రియా కూడా చేరిపోబోతోంది. కొన్నాళ్ళ క్రితం ఏకంగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన కూడా నజ్రియా పేరు వినిపించింది. ఏమో, ‘అంటే సుందరానికీ..’ సినిమాతో హిట్టు కొడితే, టాలీవుడ్‌లో నజ్రియా చక్రం తిప్పేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS