నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. `జైసింహా` వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ఈ హిట్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న రెండో చిత్రమిది. బాలకృష్ణ నటిస్తోన్న 105వ చిత్రమిది. ఇటీవల థాయ్‌లాండ్‌లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్ నేటి నుండి హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది. షెడ్యూల్‌లో భాగంగా అన్బు, అరవి అధ్వర్యంలో భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతోన్న ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనపడతారు. ఇటీవల విడుదలైన ఓ లుక్‌కి, పోస్టర్స్‌కి ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వచ్చింది.