బాల‌య్య సినిమాకు ఎంత క‌ష్ట‌మొచ్చిందో..?

మరిన్ని వార్తలు

నందమూరి బాల‌కృష్ణ - కె.ఎస్‌.ర‌వికుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి `రూల‌ర్‌` అనే పేరు ప‌రిశీలిస్తున్నారు. డిసెంబ‌రులో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తారు. అయితే ఈ సినిమా కొన‌డానికి బ‌య్య‌ర్లు ముందుకు రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. బాల‌య్య సినిమా మ‌రీ భారీ రేట్ల‌కు అమ్ముడుపోదు గానీ, డీసెంట్ మార్కెట్ మాత్రం జ‌రుగుతుంది. కానీ... అది కూడా ఈ సినిమాకి జ‌ర‌గ‌డం లేదు.

 

మ‌రీ ముఖ్యంగా స్టార్ హీరో సినిమాల‌కు ఓవ‌ర్సీస్ ముందుగానే అమ్మేస్తారు. కానీ అక్క‌డ కూడా ఈ సినిమాకి రేట్లు రావ‌డం లేదు. కె.ఎస్‌.ర‌వికుమార్‌పై న‌మ్మ‌కాలు లేక‌పోవ‌డం, ఇది వ‌ర‌కు వ‌చ్చిన ఎన్టీఆర్ బ‌యోపిక్‌లు రెండూ బోల్తా కొట్ట‌డంతో ఈ సినిమా కొన‌డానికి ఎవ‌రూ ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని తెలుస్తోంది. కాక‌పోతే జెమినీ టీవీకి శాటిలైట్ మాత్రం అమ్ముడైంది. ఈ రూపంలో ఎన్ని కోట్లొచ్చాయ‌న్న‌ది మాత్రం ఇంకా తెలీలేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS