నందమూరి బాలకృష్ణ సినిమా అంటే పవర్ ఫుల్ టైటిల్సే గుర్తొస్తాయి. 'సింహా', , 'అఖండ'.. ఇలా టైటిల్ ఎంత పవర్ ఫుల్‌గా ఉంటే.. సినిమా అంత హిట్టు. ఇప్పుడు కూడా 'వీర సింహారెడ్డి'గా ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అది కూడా మంచి మాసీ టైటిలే. బాలయ్య సినిమా అనగానే.. ముందు ఆయన ఇమేజ్‌కి తగిన టైటిల్ ఎంచుకోవడానికే దర్శక నిర్మాతలు ఎక్కువగా కష్టపడుతుంటారు. ప్రస్తుతం బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి `బ్రో` అనే టైటిల్ పరిశీలిస్తున్నార్ట. ఇది అన్నా చెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే కథ. అందుకే `బ్రో` అనే టైటిల్ అయితేబాగుంటుందని అనిల్ రావిపూడి భావిస్తున్నట్టు టాక్.
'బ్రో' టైటిల్.. ట్రెండీగానే ఉంది. ఇప్పుడంతా 'బ్రో..' బ్యాచే. ఫ్రెండ్స్‌ని, తెలిసిన వాళ్లనీ `బ్రో` అంటూ పిలుచుకోవడం అలవాటైపోయింది. అందుకే అనిల్ రావిపూడి ఈ టైటిల్ పై మొగ్గు చూపిస్తున్నాడు. కాకపోతే... బాలయ్య ఇమేజ్‌కి, ఆయన వయసుకీ ఈ టైటిల్ సరితూగడం లేదు. బాలయ్య కూడా ఈ టైటిల్ కి ఒప్పుకోకపోవొచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్ కి కూడా ఈ టైటిల్ పెద్దగా రుచించడం లేదు. బాలయ్య ఈ టైటిల్ ఒప్పుకోకపోతే బాగుణ్ణు అని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. ఈ ఫీడ్ బ్యాక్ గనుక... అనిల్ రావిపూడి కూడా పరిగణలోనికి తీసుకొంటే.. ఈ టైటిల్ చర్చల దశలోనే ఆగిపోవడం ఖాయం.