హీరోగా సునీల్ వరుస పరాజాయాలతో వెళుతున్న సమయంలో తెలివిగా మరోసారి తనని నిలబెట్టిన కామెడీ వైపే మొగ్గు చూపి ప్రస్తుతం రెండు పెద్ద చిత్రాలలో కమెడియన్ గా చేస్తున్నాడు.
ఇదే సమయంలో ఆయన హీరోగా కూడా తను చేయగలిగే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా దర్శకుడు వీరభద్రం ఒక క్రైమ్ కామెడీ స్టొరీ లైన్ చెప్పడం అది సునీల్ కి బాగా నచ్చడం జరిగాయట. త్వరలోనే ఈ చిత్రం పైన తుది నిర్ణయం సునీల్ తీసుకుంటాడు అని సమాచారం.
అన్ని కలిసొస్తే, సునీల్ హీరోగా మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు అని అర్ధమవుతున్నది. అయితే కమెడియన్ గా కూడా కొనసాగాలి అని కూడా గట్టి నిర్ణయమే తీసుకున్నాడు అని అనుకోవచ్చు. ఎందుకంటే, ఆయన కమెడియన్ గా ఒప్పుకున్న చిత్రాలు ఒకటి రవితేజతో కాగా మరొకటి మెగాస్టార్ చిరంజీవితో..
ఆయన ఇటు కమెడియన్ గా అటు హీరోగా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం..