ఈమధ్య తెలుగు సినిమా పాటలు మిలియన్ల కొద్దీ వ్యూస్ తో యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. తాజాగా అదే బాటలో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమా లోని 'నీలి నీలి ఆకాశం' పాట భారీ వ్యూస్ తో ఒక రికార్డు సృష్టించింది. సినిమా రిలీజ్ కాకముందే 200 మిలియన్ల వ్యూస్ సాధించిన తొలి సౌత్ ఇండియన్ పాటగా రికార్డు సృష్టించింది.
ప్రదీప్ మాచిరాజు - అమృత అయ్యర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మున్నా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నిజానికి వేసవిలోనే విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా క్రైసిస్ కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. సినిమా రిలీజ్ తో సంబంధం లేకుండా నీలి నీలి ఆకాశం పాట మాత్రం సంగీత ప్రియులను అలరిస్తోంది. రిలీజ్ అయిన ఈ రోజునుంచే ప్రేక్షకులను మెప్పించిన ఈ పాట ఇప్పటివరకు 200 మిలియన్లకు పైగా వ్యూస్ నమోదు చేయడం గమనార్హం.
ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. నీలి నీలి ఆకాశం పాటకు సాహిత్యం అందించినవారు చంద్రబోస్. ఈ పాటను సిద్ శ్రీరామ్ - సునీత ఆలపించారు.