యంగ్ హీరో బెల్లంకొండతో కాజల్ అగర్వాల్ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఒకటి కాగా, మరో సినిమా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా యాక్షన్ డ్రామా కాగా, తేజ దర్శకత్వంలో విభిన్న తరహా చిత్రమనీ తెలుస్తోంది.
ఇంతవరకూ తన బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా యాక్షన్ ఓరియెంటెడ్ కమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాల్లోనే నటించాడు బెల్లంకొండ. కానీ తేజతో చేయబోయే చిత్రంపై పలు రకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. బెల్లంకొండ సినిమాలన్నీ చాలా రిచ్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందుతుంటాయి స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా. బెల్లంకొండ లుక్ కూడా రిచ్‌గానే ఉంటుంది. కానీ తేజ దర్శకత్వంలో రూపొందే సినిమాలో బెల్లంకొండ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడట. పల్లెటూరి అబ్బాయిలా పేదింటి కుర్రోడిలా కనిపించబోతున్నాడనీ సమాచారమ్. ఈ సినిమాలో కాజల్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉండబోతోందట.
తేజ - కాజల్ కాంబినేషన్‌లో రానా హీరోగా వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో కూడా కాజల్ పాత్రకు ప్రాధాన్యత ఎక్కువ. అలాగే ఈ సినిమాలో కూడా హీరోతో ఈక్వెల్ ఇంపార్టెన్స్ ఉండేలా కాజల్ పాత్రని డిజైన్ చేశాడట. ఈ సినిమా జెట్ స్పీడుతో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ఏడాది చివర్లోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో తేజ అండ్ టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది.
'ఎన్టీఆర్' బయోపిక్ నుండి తప్పుకున్నాక తేజ ఈ సినిమాపైనే పూర్తిగా కాన్‌సన్‌ట్రేషన్ చేశాడు.