బోల్డ్‌ అండ్‌ హాట్‌ సింగర్‌

మరిన్ని వార్తలు

ఆమె పాటలు చాలా హాట్‌గా వుంటాయి. ఆ పాటలకి ఆమె వాయిస్‌ కారణంగానే అంత హాట్‌ అప్పీల్‌ వస్తుంటుంది. విలక్షణమైన పాటలతో సంగీత ప్రియుల్ని అలరిస్తోన్న ఆ బ్యూటీ, తన ఫొటోలతోనూ హీటెక్కించేస్తుంటుంది. అందమైన వాయిస్‌ మాత్రమే కాదు, అంతకు మించిన హాట్‌ పర్సనాలిటీతో కిర్రాకు పుట్టించే ఆ బ్యూటీ ఎవరో కాదు, నేహా భాసిన్‌. బాలీవుడ్‌ ప్రేక్షకుల్నీ, తెలుగు ప్రేక్షకుల్నీ తన పాటలతో తన అంద చందాలతో కట్టిపడేస్తోన్న నేహా బాసిన్‌ బికినీ ఫొటోలతో సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు హల్‌చల్‌ చేస్తూనే వుంటుంది. 'అందం చూడవయా.. ఆనందించవయా..' అని చెబుతూ తనను ట్రాలింగ్‌ చేసేవారికి కౌంటర్లు ఇవ్వడంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది నేహా భాసిన్‌. ఏ మాటకామాటే చెప్పుకోవాలి.. ఐటమ్‌ బాంబుల్ని తలదన్నే హాట్‌ అప్పీల్‌ నేహా భాసిన్‌కి వుందండోయ్‌. ఆ సంగతి పక్కన పెడితే పాటలతోనే కాదు, ఆల్బమ్స్‌లో అప్పుడప్పుడూ మెరుస్తూ నేహా భాసిన్‌ అభిమానుల్ని అలరిస్తూ వస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS