నేహా శర్మ క్వారంటీన్ లైఫ్‌ని సోదరి ఐశా శర్మతో కలిసి బాగానే ఎంజాయ్ చేస్తోంది. అభిమానుల కోసం హాట్ హాట్ ఫొటోలు, వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఈ హాట్ హాట్ అక్కా చెల్లెళ్ళు. తాజాగా నిన్న ‘హ్యాపీ ఎర్త్ డే’ అనే హ్యాష్ ట్యాగ్‌తో ఓ హాట్ ఫొటోని నేహా శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇదేం పైత్యం చెప్మా? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అక్కడ విషయం వేరు, ఇక్కడ నేహా శర్మ పోస్ట్ చేసిన ఫొటో వేరు. దానికీ దీనికీ అస్సలేమాత్రం సంబంధం లేదు. ఏదో ఒక వంక పెట్టుకుని అందాల ప్రదర్శన చేయడమేనా.? అని నెటిజన్లు ఏకి పారేస్తున్నారు నేహా శర్మని.
ఏదో క్వారంటీన్ లైఫ్‌లో జనాలకి బోర్ కొట్టకూడదన్న ఉద్దేశ్యంతో గ్లామరస్ ఫొటో షేర్ చేస్తే ఇంత రాద్ధాంతమా.? అని ఈ ముద్దుగుమ్మ వాపోతోందట. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘చిరుత’ సినిమాతో నేహా శర్మ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం విదితమే. మెగా పవర్ స్టార్ రావ్‌ుచరణ్‌కి అదే డెబ్యూ ఫిలిం. ఆ తర్వాత వరుణ్ సందేశ్‌తో ‘కుర్రాడు’ అనే ఓ సినిమాలోనూ నటించింది ఈ భామ. అయితే, తెలుగులో ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసింది. అందులో కొన్ని బి-గ్రేడ్ కామెడీ సినిమాలూ వున్నాయ్. అయినాగానీ, అక్కడా నేహా శర్మకి పెద్దగా సక్సెస్‌లు రాలేదు. సినిమాల సంగతెలా వున్నా, సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ భలే యాక్టివ్.!