డ‌బుల్ మీనింగ్ డైలాగుల డోసు పెరిగింది

By iQlikMovies - December 25, 2018 - 17:50 PM IST

మరిన్ని వార్తలు

తెలుగులో ఇప్పుడు బోల్డ్ క‌థ‌లు రాజ్య‌మేలుతున్నాయి. వాటికి యువ‌తరం ప్రేక్ష‌కులు మెగ్గు చూప‌డం, కావ‌ల్సినంత ఫ్రీ ప‌బ్లిసిటీ దొరికేస్తుండ‌డంతో.. ఈ త‌ర‌హా సినిమాల‌పై దృష్టి పెడుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈమ‌ధ్య `ఏడు చేప‌ల క‌థ‌` అనే ఓ టీజ‌ర్ వ‌చ్చింది. అది చూసి.. జ‌నాలంతా షాక్ తిన్నారు. ఇంత బోల్డ్‌గా ఉందేంటి బాబోయ్ అనుకున్నారు. ఇప్పుడు అంత‌కు మించిన ట్రైల‌ర్ వ‌చ్చింది.  అదే.. `నేను లేను`.

ఈమ‌ధ్య వ‌చ్చిన ఏడు చేప‌ల క‌థ టీజ‌ర్ కంటే ఇందులో  ప‌ది రెట్లు ఎక్కువ మ‌సాలా ద‌ట్టించారు. ఇదే దెయ్యం క‌థ‌. వెరైటీ ఏమిటంటే దెయ్యం హీరోని ప్రేమ‌లోకి దింపి, ఆ త‌ర‌వాత శృంగారంలో ముంచెత్తుతుంది. ముద్దులు, హ‌గ్గులు, ప‌డ‌గ్గ‌ది స‌న్నివేశాల‌తో పాటు.. డ‌బుల్ మీనింగ్ డైలాగులూ ఇందులో ద‌ట్టించారు. దెయ్యంతో సెక్స్ చేసే క‌థ‌తో `నాట‌కం` అనే ఓ సినిమా వ‌చ్చింది.

ఆ సినిమా టీజ‌ర్లు, ట్రైల‌ర్లు ఇలానే బాగా ఆక‌ట్టుకున్నాయి. తీరా థియేట‌ర్‌లోకి వెళ్తే.. క‌థ‌లో విష‌యం లేక తేలిపోయింది. మ‌రి ఈ `నేను లేను` విష‌యంలో ఏం జ‌రుగుతుందో? ఈ సినిమాకి గ‌నుక కాసిన్ని ఓపెనింగ్స్ వ‌స్తే... దెయ్యంతో సెక్స్ చేసే క‌థ‌లు ఇంకొన్ని త‌యార‌వుతాయేమో..?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS