పవర్ స్టార్ కొత్త సినిమా కాటమరాయుడు మొదలైన రోజు నుండి ఏదో ఒక వార్తల్లో ఉంటూనే ఉంది.ఈ మధ్యనే సినిమాలో కొన్ని సీన్స్ రీ-షూటింగ్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. నిన్నటికి నిన్న ప్రస్తుతం పనిచేస్తున్న డైలాగ్ రైటర్ ని పక్కనపెట్టి కొత్త రైటర్ ని తీసుకున్నారనే వార్త సంచలనం సృష్టించింది. ఇవన్నీ మరిచిపోకముందే సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ పై పవన్ అసహనం వ్యక్తం చేసినట్టు న్యూస్ బయటకి వచ్చింది. అనూప్ ఇచ్చిన ట్యూన్స్ నచ్చకపోవడమే దీనికి కారణం అంటూ ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాని పవన్ క్లోజ్ సర్కిల్స్ మాత్రం వీటిలో ఏమాత్రం నిజం లేదు అని చెబుతున్నారు. మరీ ఇంతలా పుకార్లు ఎందుకు వస్తున్నాయో కాటమరాయుడు పై అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న!