త్రిష ఎందుకు వదిలేసింది 'సామీ'!

మరిన్ని వార్తలు

విక్రమ్‌ హీరోగా తెరకెక్కుతోన్కన చిత్రం 'సామీ - 2'. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. హరి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యింది. అయితే ఇందులో మరో హీరోయిన్‌గా నటిస్తున్న త్రిష, ఈ సినిమా నుండి తప్పుకుంది. ఇందుకు అనేక గాసిప్స్‌ ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇదే విషయం త్రిషని అడిగితే, క్రియేటివ్‌ కారణాల దృష్ట్యా ఈ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పింది. కానీ బయట ప్రచారం అవుతున్న గాసిప్స్‌ మరోలా ఉన్నాయి. హీరోయిన్‌ కీర్తి సురేష్‌కీ, త్రిషకీ మధ్య విబేధాలు రావడంతోనే ఈ సినిమా నుండి త్రిష తప్పుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే హీరో విక్రమ్‌కీ, త్రిషకీ మధ్య డిఫరెన్సెస్‌ వల్ల ఈ సినిమా వదులుకుంది త్రిష అంటూ మరో ప్రచారం జరుగుతోంది. కాదు డైరెక్టర్‌కీ, త్రిషకి సఖ్యత కుదరకే ఈ సినిమాను త్రిష పక్కన పెట్టేసిందనీ మరో గాసిప్‌ వినిపిస్తోంది. అసలింతకీ వీటిలో ఏది నిజమన్నది తెలీదు. మరో పక్క త్రిష చేతిలో చాలా సినిమాలున్నాయి. షెడ్యూల్స్‌ మేనేజ్‌ చేయలేక త్రిష ఈ సినిమాని వదులుకున్నాననీ చెబితే అది వేరే విషయం. కానీ 'క్రియేటివ్‌ సమస్యలు' కారణం అనడంతో అసలు త్రిషని ఎవరు ఇబ్బంది పెట్టారో అంటూ ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలింతకీ త్రిషని ఇబ్బంది పెట్టిన ఆ క్రియేటివ్‌ సమస్యలు ఏంటో కానీ, ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమాకి త్రిష ఆల్‌ ది బెస్ట్‌ చెప్పింది. తాను తప్పుకున్నప్పటికీ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్న త్రిషని అభినందించాలి. కాగా త్రిష ప్రస్తుతం పలు హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS