ప్రముఖ గజల్స్ గాయకుడు శ్రీనివాస్ పైన లైంగిక వేధింపుల కేసు నమోదుకావడం ఆ కేసుకి సంబంధించి జైలు శిక్ష అనుభవించిన సంగతి విదితమే.
అయితే ఆ తరువాతి కాలంలో ఈ కేసు విషయం అందరూ మరిచిపోయారు. ఈ తరుణంలో మరోసారి ఈ కేసు తెరపైకి వచ్చింది. అయితే ఈ సారి ఈ కేసులో ఒక కొత్త ట్విస్ట్ వచ్చింది, అదేంటంటే- ఈ కేసు పెట్టిన మహిళకి బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయి.
ఆ కాల్స్ లో ఆమెని వెంటనే ఈ కేసుని వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారట. ఇదే విషయమై సంబందిత బాధితురాలు పోలీసులని ఆశ్రయించింది. పోలీసులు ఈ కాల్స్ ఎవరు చేస్తున్నారు అని ఆరా తీయగా- విజయలక్ష్మి అనే ఓ మహిళ ఈ కాల్స్ చేస్తున్నది అని తెలుసుకుని వెంటనే అమెపైన కేసు నమోదు చేశారు పోలీసులు.
అయితే ఆ మహిళ తో కాల్స్ చేయిస్తున్నది గజల్ శ్రీనివాస్ అని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి గజల్ శ్రీనివాస్ కేసు ఒక కొత్త మలుపు తిరిగింది.