తన చుట్టూ ఉన్నవారు అలాగే తనని నమ్ముకున్న వారికి ఏదైనా అయితే ఊరికే చూస్తుండే మనస్తత్వం కాదు పవన్ కళ్యాణ్ ది. ఈ విషయం ఇప్పటికే పలుమార్లు రుజువు కూడా అయింది.
తాజాగా ఆయన చేసిన ఒక పనిని గురించి దర్శకుడు త్రివిక్రమ్ ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపాడు. ఆ వివరాల ప్రకారం, అజ్ఞాతవాసి చిత్రం పరజాయం పాలైనప్పుడు సినిమా రూ 90 కోట్లకి బిజినెస్ జరిగి వసూళ్ళు మాత్రం రూ 60 కోట్లే వచ్చాయట.
ఈ తరుణంలో వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత చినబాబు ని కలుపుకుని సుమారు రూ 25కోట్ల నష్టాన్ని తిరిగి చెల్లించినట్టుగా చెప్పుకొచ్చాడు. తనని నమ్ముకుని డబ్బులు పెట్టి మోసపోవడం తనకు నచ్చదు అని పవన్ కళ్యాణ్ ఎప్పుడు అంటుంటారు అని త్రివిక్రమ్ చెప్పాడు సదరు ఇంటర్వ్యూ లో...
ఇప్పుడు ఈ వార్త అంతర్జాలంలో వైరల్ అయింది.