నయనతార పెళ్లెప్పుడంటే.!

మరిన్ని వార్తలు

సౌత్‌లో ఏ హీరోయిన్‌కీ లేని బీభత్సమైన క్రేజ్‌ నయనతారకుంది. తెలుగు, తమిళ భాషల్లో నయనతారకు తిరుగే లేదు. అందుకే సౌత్‌ క్వీన్‌గా నయనతార అభివర్ణించబడుతోంది. లవర్స్‌డే సందర్భంగా నయనతార పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్‌ టాక్‌ బయటికి వచ్చింది. లవ్‌లో ఎన్నో ఎత్తుల్నీ, పల్లాల్నీ చవి చూసేసింది నయనతార.

 

తమిళ హీరో శింబుతో ప్రేమ.. తర్వాత ప్రభుదేవాతో ప్రేమ.. ఆ రెండూ పెటాకులు కావడం జనానికి తెలిసిన విషయాలే. తమిళ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో నయన్‌ ఇప్పుడు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన సంగతి కూడా తెలిసిందే. చేతి నిండా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, కాస్త సమయం దొరికినా ఈ ప్రేమ జంట హాయిగా విదేశాలకు ఎగిరిపోతుంటుంంది. అక్కడ ఎంజాయ్‌ చేసిన తమ ప్రేమ ఫోటోలనూ, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి మురిసిపోతుంటుంది. అయితే ఈ ముద్దు మురిపాలు కేవలం ప్రేమకే పరిమితమా.? పెళ్లి మాటేంటీ.? అంటే నటిగా సెంచరీ కొట్టేదాకా నయనతార పెళ్లి చేసుకోదంట అనే వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. లేదు లేదు త్వరలోనే నయన్‌ పెళ్లి కబురు చెబుతుందంటూ మరో న్యూస్‌ వినిపిస్తోంది.

 

మొత్తానికి ఇటు సౌత్‌ క్వీన్‌ నయనతార పెళ్లి, అటు స్వీటీ బ్యూటీ అనుష్క పెళ్లి విషయంలో వారికి ఏమాత్రం బెంగ లేకున్నా, పాపం ఫ్యాన్స్‌ మాత్రం తెగ బెంగ పడిపోతున్నారు. ఎప్పటికి ఈ ముద్దుగుమ్మలు పెళ్లి వార్త చెబుతారో ఫ్యాన్స్‌లో పెరిగిపోతున్న ఈ ఒత్తిడిని తగ్గిస్తారో మరి చూడాలిక. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS