బుల్లితెర పైన తన మార్కు చూపెట్టిన ప్రభాకర్ ఇప్పుడు వెండితెర పైనా తన మార్కు వేసే ప్రయత్నంలో ఆయన చేసిన తొలి ప్రయత్నమే నెక్స్ట్ నువ్వే చిత్రం.
ఈ చిత్రానికి సంబంధించి టాక్ యావరేజ్ అని రావడంతో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసే పనిలో ఆ యూనిట్ సభ్యులు ఉన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి, ఏలూరు, విజయవాడ & గుంటూరులలో ఈ చిత్రం ప్రదర్శితం అవుతున్న థియేటర్లకి వెళ్ళి అక్కడ ప్రేక్షకులని కలవనున్నారు.
ఈ ప్రమోషన్స్ లో దర్శకుడు ప్రభాకర్ తో పాటుగా చిత్ర యూనిట్ మొత్తం పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ ప్రమోషన్స్ ఈ చిత్రానికి ఎంత వరకు ఉపయోగపడతాయి అన్నది ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ బట్టి తెలిసిపోతుంది.