2.0 ట్రైలర్ విడుదల వేడుకలో ఎంత పెద్ద ఎత్తున జరిగాయో అంతే స్థాయిలో అభిమానులకి ఊహించని షాక్ లు కూడా ఎదురయ్యాయి.
అందులో ఒకటి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ నుండి వెలువడిన రిటైర్మెంట్ కి సంబంధించిన వార్త. ఈ మాట వినగానే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ విషయం గురించి ఆయన వివరిస్తూ- నాకు నలభై ఏళ్ళు వచ్చేసరికి నేను సంగీత ప్రపంచంలో ఏంటో కొంత పేరు సంపాదించుకున్న ఆ ప్రయాణంలోనే ఆస్కార్ అవార్డు కూడా సాధించడం జరిగింది.
ఆ తరువాత ఇక చాలు అని సంగీతాన్ని పక్కన పెట్టేసి నా రిటైర్మెంట్ ప్రకటించేద్దాము అని అనుకున్నాను. అదే సమయంలో నేను రోబో సినిమాకి సంగీతం చేస్తున్నాను. ఆ షూటింగ్ లో రజినీకాంత్ చేస్తున్న నటన ఆ వయసులో ఆయన పడుతున్న కష్టం చూసి నేను అనుకున్న రిటైర్మెంట్ ప్లాన్ ని పక్కన పెట్టేసాను.
నన్ను అంతలా ప్రభావితం చేసిన వ్యక్తి సూపర్ స్టార్ రజినీకాంత్ అంటూ తన మనసులోని మాటని బయటపెట్టాడు. దీన్నిబట్టి రెహ్మాన్ అభిమానులు నిజంగా రజినీకాంత్ కి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే....