హీరోయిన్ నిధి అగర్వాల్, పాస్‌పోర్ట్ మిస్ చేసుకోవడంతో అది 'ఇస్మార్ట్ శంకర్' సినిమా షూటింగ్‌కి కొంత ఇబ్బందికరంగా మారిన సంగతి తెల్సిందే. ఆ సంగతి పక్క పెడితే, నిధి అగర్వాల్ రీసెంట్గా రెండు ముఖ్యమైన ఈవెంట్స్ మిస్ అయ్యింది.
ఆ రెండూ 'ఇస్మార్ట్' పుట్టిరోజులే కావడం గమనార్హం. మొన్న హీరో రామ్ పోతినేని పుట్టినరోజు, నేడు నిర్మాతగా మారిన మాజీ నటి ఛార్మి పుట్టినరోజు. హీరో రామ్‌కి ఆల్రెడీ తనదయిన స్టయిల్లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నిధి, సోషల్ మీడియా వేదికగా ఛార్మికి కూడా అదే తరహాలో బర్త్ డే విషెస్ అందించింది. ఛార్మితో షూటింగ్ స్పాట్‌లోని సెల్ఫీని నిధి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఛార్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. అయితే, ఇది పాత ఫొటోనే. నిధి అందించిన విషెస్‌కి స్పందిస్తూ, రెండు ఈవెంట్స్‌కి రాకుండా తప్పించుకున్నావ్గా.. అంటూ ఛార్మి సెటైర్ వేస్తూ రీ-ట్వీట్ చేసింది. ఒకప్పుడు హాట్ బ్యూటీగా తెలుగు తెరపై ఓ రేంజ్లో హల్చల్ చేసిన ఛార్మి, ఇప్పుడు బాస్ లేడీగా మారిపోయింది.
ఇప్పటికీ హీరోయిన్లతో పోటీ పడే అందంతో మెరిసిపోతున్నా, ఛార్మి మాత్రం తనకు నటన కంటే సినీ నిర్మాణంపైనే మక్కువ ఎక్కువని స్పష్టం చేసింది. 'ఇస్మార్ట్ శంకర్'తోపాటు, పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై 'రొమాంటిక్' అనే సినిమాని సైతం ఛార్మి నిర్మిస్తున్న సంగతి తెల్సిందే.