రుక్సార్‌.. ఈసారైనా హిట్టు కొట్టేనా.!

మరిన్ని వార్తలు

అందానికి అందం, ఆ అందానికి తగినంత గ్లామర్‌.. అన్నిటికీ మించి చక్కని నటన.. అన్నీ వున్నా ఎందుకో హీరోయిన్‌ రుక్సార్‌కి టైమ్‌ కలిసి రావడంలేదు. తాజాగా ఆమె 'ఏబీసీడీ అమెరికన్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్‌డ్‌ దేశీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

 

ముచ్చటగా మూడోస్సారి అయినా రుక్సార్‌ విజయాన్ని అందుకుందా? అంటే, కాస్త కస్టమేనని ఫస్ట్‌ రిపోర్ట్స్‌ చెబుతున్నాయి. సినిమాకి యావరేజ్‌ రేటింగ్స్‌ మాత్రమే కన్పిస్తున్నాయి. అయితే రుక్సార్‌ బాగానే చేసిందనే అభినందనలు మాత్రం ఆమెకు అందుతుండడం ఆమెకు కాస్త ఊరట. గ్లామర్‌ పరంగా రుక్సార్‌ ఆకట్టుకుంది. రుక్సార్‌కి తెలుగులో తొలి సినిమా 'ఆకతాయి'. చిన్న సినిమా కావడంతో ఎవరూ పట్టించుకోలేదామెని. అయితే రుక్సార్‌, నేచురల్‌ స్టార్‌ నానితో కలిసి 'కృష్ణార్జున యుద్ధం' సినిమాలో కన్పించేసరికి ఆ టైమ్‌లో ఆమె గురించి టాలీవుడ్‌లో బాగానే మాట్లాడుకున్నారు. కానీ 'కృష్ణార్జునయుద్ధం' సినిమా కూడా ఆమెకు మంచి విజయాన్నివ్వలేదు.

 

ఈ మధ్య రివ్యూలు, ఫస్ట్‌ టాక్‌కి భిన్నంగా సినిమాలు వసూళ్ళు సాధిస్తుండడం, విజయాల్ని అందుకుంటుండడం చూస్తున్నాం కాబట్టి, 'ఏబీసీడీ' అలాంటి మ్యాజిక్‌ చేస్తే రుక్సార్‌కి దశ తిరిగినట్లే అవుతుంది. పెద్దగా అంద చందాల్లేని హీరోయిన్లు అవకాశాలు కొల్లగొట్టేస్తోంటే, ఈ చందమామ లాంటి అందానికి సక్సెస్‌ రాకపోతే ఎలా? 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS