టాలీవుడ్‌లో ఎప్పటి నుండో హీరోయిన్స్ కొరత ఉన్న సంగతి తెలిసిందే. అందుకే కొంచెం క్రేజ్ ఉంటే చాలు, సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా ముద్దుగుమ్మలకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. గతంలో సక్సెస్ వస్తేనే, ఆ భామకు మరో అవకాశం దక్కేది. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. ట్రెండ్ సెట్టర్స్‌గా మారుతున్నారు ముద్దుగుమ్మలు. పూజాహెగ్దే, రష్మికా మండన్నా, నిధి అగర్వాల్ తదితర కొత్త భామలతో పాటు, సమంత, కాజల్ అగర్వాల్ వంటి వారు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ కూడా లిస్టులోనే ఉన్నారు. వన్స్ హీరోయిన్ అనిపించుకున్నాక, ఆ ట్యాగ్‌ని సుదీర్ఘ కాలం పాటు కొనసాగించాలనే కోరిక ఉండడంలో తప్పేం లేదు.
నిధి అగర్వాల్ కూడా అంతే. గ్లామర్‌తో పాటు, మంచి నటిని అనిపించుకోవాలనుకుంటోంది. ఈ బ్యూటీ చేసినవి రెండు సినిమాలే అయినా, రెండూ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినవే. కానీ, హీరోయిన్‌గా క్రేజ్ మాత్రం అలాగే ఉంది నిధి అగర్వాల్‌కి. ఒక్క సక్సెస్ ఇచ్చి చూడండి, దుమ్ము దులిపేస్తా అంటోంది. ఆకట్టుకునే అందంతో పాటు, మొహమాటం లేని ఎక్స్‌పోజింగ్, కమర్షియల్‌గా ఉండాల్సిన టాలెంట్.. ఇలా అన్ని లక్షణాలూ సవ్యంగా ఉన్నాయి నిధి అగర్వాల్‌లో. అందుకే ఆమెకు కోరికలు కూడా పెద్దగానే ఉన్నాయి.
భారీ బడ్జెట్ మూవీస్‌లో అంటే, ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించాలన్నదే నిధి కోరికట. స్టార్ డైరెక్టర్‌తో ఒక్క ఛాన్స్ వస్తే తన టాలెంట్ ఏంటో తెలుస్తుందంటోంది. ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ సినిమా 'ఇస్మార్ట్ శంకర్'లో నటిస్తోంది. రామ్‌కి జోడీగా నటిస్తున్న ఈ సినిమా తనకెంతో ప్రత్యేకం అంటోంది నిధి అగర్వాల్. ముచ్చటగా మూడో సినిమాగా వస్తున్న ఈ సినిమా అయినా నిధికి 'అదృష్ట నిధిóని తెచ్చిపెడుతుందో లేదో చూడాలిక.