కన్‌ఫామ్డ్‌: 'ఇస్మార్ట్‌ గాళ్‌' నిధి అగర్వాల్‌.!

మరిన్ని వార్తలు

'మిస్టర్‌ మజ్ను'కి ఫ్లాప్‌ అనే టాక్‌ వచ్చింది. అంతకు ముందు 'సవ్యసాచి' కూడా నిరాశపరిచింది. అయినా ఆఫర్లు మాత్రం పోటెత్తుతున్నాయ్‌ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌కి. ఫీచర్స్‌ పరంగా ఈ ముద్దుగుమ్మకి డిఫరెంట్‌ అప్పీల్‌ ఉంది. దాంతో యంగ్‌ హీరోలకు నిధి ఆప్షన్‌ అయ్యింది. ఏరి కోరి యంగ్‌ హీరోలు నిధి అగర్వాల్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలనుకుంటున్నారట. అయితే ప్రస్తుతానికి ఆ ఛాన్స్‌ ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ దక్కించేసుకున్నాడు. 

 

రామ్‌ - పూరీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాలో నిధి అగర్వాల్‌ కన్‌ఫామ్‌ అయ్యిందని చిత్ర యూనిట్‌ తాజాగా అనౌన్స్‌ చేసింది. నిధి అగర్వాల్‌ మంచి డాన్సర్‌. అయితే సవ్యసాచిలో చైతూ పక్కన ఆ ఛాన్స్‌ సరిగ్గా సద్వినియోగం చేసుకునే అవకాశం రాలేదు. అఖిల్‌ మంచి డాన్సింగ్‌ పాట్నర్‌ అయినా మిస్టర్‌ మజ్నులో లిరిక్స్‌ పరంగా నిధికి ఎక్కువగా డాన్సులు వేసే అవకాశం చిక్కలేదు. 

 

ఇక ఇప్పుడు రామ్‌ ఎనర్జీని మ్యాచ్‌ చేయగల అసలు సిసలు డాన్సింగ్‌ పాట్నర్‌ నిధి అనడంలో అతిశయోక్తి లేదు. తొలి సినిమా సవ్యసాచితోనే హిట్‌ కొట్టిందా స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి వెళ్లడం ఖాయం అని భావించారంతా. కానీ కుదరలేదు. పోనీ అఖిల్‌ సినిమాతోనైనా సత్తా చాటుతుందేమో అంటే అదీ జరగలేదు. ఇక ముచ్చటగా మూడో సినిమా ఇటు నిధి అగర్వాల్‌కీ, అటు పూరీ జగన్నాధ్‌కీ, రామ్‌కీ కూడా ఇస్మార్ట్‌గా కలిసి రావాల్సిన సినిమా. చూడాలి మరి ఏం జరుగుతుందో. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS