తొలిప్రేమ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచమైన యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి. తొలి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్న వెంకీ తాజాగా అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా 'మిస్టర్ మజ్ను' తో మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో జూ. ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడు? అనే ప్రశ్నకి అతను ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడు చేస్తారు అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా, 'ఆయనతో సినిమా చేయాలని నాకు గట్టిగా కోరిక ఉంది. కానీ ఎన్టీఆర్ వంటి ఒక స్టార్ హీరోతో సినిమా చేయటం అనేది ఒక పెద్ద బాధ్యత. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలంటే ఇంకాస్త అనుభవం, దైర్యం కావాలనీ, అవన్నీ వచ్చాక ఒక మంచి స్క్రిప్ట్ తో ఆయనతో కచ్చితంగా ఒక సినిమా చేస్తాను. కానీ అది ఎప్పుడు అన్నది మాత్రం చెప్పలేనంటూ' సమాధానమిచ్చాడు.
మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ వేడుకకి చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఎన్టీఆర్.. వెంకీ తనకి మంచి ఫ్రెండ్ అని, ఒక మంచి దర్శకుడు అంటూ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. కాకపోతే, వెంకీ రొమాంటిక్ చిత్రాలు తెరకెక్కించడంలో మంచి నిపుణుడు అనిపించుకున్నాడు. ఎన్టీఆర్ మాస్ డ్రామాని డెలివరీ చేయటంలో నిపుణుడు. అందువల్ల, వెంకీ కోరిక వినగానే ఎన్టీఆర్ అభిమానులందరూ వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందా అని ఆలోచనలో పడ్డారు.