అందమైన 'నిధి' అంతకుమించిన మనసు.!

మరిన్ని వార్తలు

అందాల భామలు స్క్రీన్‌పై అందాల ఆరబోతలో ఎంత పెద్ద మనసు చాటుకుంటున్నారో, అంతకు మించి పెద్ద మనసును సామాజిక కార్యక్రమాల్లో కూడా చూపిస్తున్నారు. సమంత, హన్సిక, రకుల్‌ ప్రీత్‌సింగ్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలా మంది భామలు సోషల్‌ సర్వీస్‌లోనూ భాగం పంచుకుంటున్నారు. తాము సంపాదించిన సొమ్ములో ఎంతో కొంత భాగం పేదలకు పంచి పెడుతున్నారు. 

 

తాజాగా ఈ దారిలోకి అందాల భామ నిధి అగర్వాల్‌ కూడా వచ్చేసింది. హీరోయిన్‌గా తెలుగులో రెండు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో 'మున్నా మైఖేల్‌' సినిమాతో సుపరిచితురాలు. ఇక అసలు మేటరేంటంటే, తాజాగా నిధి అగర్వాల్‌ ముంబయ్‌లోని పేద పిల్లలకు కొన్ని ఫుడ్‌ ఐటెమ్స్‌ని పంచి పెట్టింది. 

 

ఆ రకంగా ఎంతో కొంత ఆ పేద పిల్లల ఆకలిని తీర్చడంలో నిధి అగర్వాల్‌ భాగం పంచుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. నిధి అగర్వాల్‌ పెద్ద మనసుకు ఆమె ఫ్యాన్స్‌ అభినందిస్తున్నారు. ప్రస్తుతం నిధి అగర్వాల్‌ 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాలో నటిస్తోంది. పూరీ జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్‌ హీరోగా నటిస్తున్నాడు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS