గ్లామ్‌షాట్‌: ఈ బుట్టబొమ్మ ఆ బుట్టబొమ్మ కాదండోయ్‌.!

మరిన్ని వార్తలు

'బుట్టబొమ్మ..' ఇప్పుడు అందరి నోటా నానుతున్న మాట. 'అల వైకుంఠపురములో..' సినిమాలో పూజా హెగ్దేపై చిత్రీకరించిన ఓ పాటలో బుట్టబొమ్మలా పూజా హెగ్దే అందాలు అందర్నీ కనువిందు చేస్తున్నాయి. ట్రెండింగ్‌లో ఉన్న ఆ బుట్టబొమ్మని అచ్చం అలా ఫాలో అయిపోతోంది ఈ బుట్టబొమ్మ. సడెన్‌గా చూస్తే పూజనే అనుకునేరు. కానీ, ఈ బుట్టబొమ్మ నిధి అగర్వాల్‌. అరె.. పప్పులో కాలేశామే అనుకుంటున్నారా.? పింక్‌ హాట్‌ షార్ట్‌ ఫ్రాక్‌లో నిధి అగర్వాల్‌ భలే అందంగుంది కదా. అసలే క్యూట్‌ అండ్‌ హాట్‌. ఇలాంటి షార్ట్‌ డ్రస్‌లో కనిపిస్తే, ఆ హాట్‌ అప్పీలే వేరప్పా. పింక్‌ కలర్‌ వెల్వెట్‌ ఫ్యాబ్రిక్‌లా కనిపిస్తున్న ఈ కాస్ట్యూమ్‌లో నిధి తళుకు బెళుకుల మెరుపులు కుర్రకారుకు కితకితలు పెట్టిస్తున్నాయి.

లైట్‌ మేకప్‌లో క్యూట్‌గా ఫోటోకి పోజిచ్చిన నిధి అగర్వాల్‌ని చూసి, నెటిజన్లు తమకు తోచిన రీతిలో కామెంట్లు పోస్ట్‌ చేస్తున్నారు. 'అందాల నిధుల బుట్టబొమ్మా.. తొలిసారి గ్లామర్‌ నిధుల్ని హైడ్‌ చేశావమ్మా..' అంటూ కొందరు కామెంట్‌ చేస్తుంటే, క్యూట్‌ అప్పీల్‌ సరే, ఇంకాస్త గ్లామర్‌ కావాలమ్మా.! అని ఇంకొందరు. పూజా కన్నా, ఈ డ్రస్‌ నీకే బాగుందంటూ.. మరికొందరు కామెంట్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి నిజంగానే ఈ పోజులో నిధి సింప్లీ సూపర్బ్‌. ఇక నిధి ఫ్యూచర్‌ ప్రాజెక్టుల విషయానికొస్తే, తమిళంలో ఓ సినిమాలోనూ, తెలుగులో గళ్లా జయదేవ్‌ తనయుడు గళ్లా అశోక్‌ డెబ్యూ మూవీలోనూ నిధి అగర్వాల్‌ నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS