ఇద్ద‌రు రెబ‌ల్ స్టార్లూ.. క‌లుస్తున్నారోచ్!

మరిన్ని వార్తలు

ఇప్పుడు అభిమానులంతా ప్ర‌భాస్‌ని రెబ‌ల్‌స్టార్ అని పిలుచుకుంటున్నారు గానీ, ఆ బిరుదు కృష్ణంరాజు సొంతం. ఆయ‌న వార‌సుడిగా అడుగుపెట్టిన ప్ర‌భాస్.. యంగ్ రెబ‌ల్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ఈ రెబ‌ల్ స్టార్లిద్ద‌రూక‌ల‌సి న‌టిస్తున్నారు. అవును.. ప్ర‌భాస్ కొత్త సినిమాలో కృష్ణంరాజు కూడా న‌టిస్తున్నారు.

 

రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే క‌థానాయిక‌. యూవీ క్రియేష‌న్స్‌, గోపీ కృష్ణా మూవీస్ సంయుక్తంగా అందిస్తున్నాయి. ఈ చిత్రంలో కృష్ణంరాజు న‌టిస్తున్నారు. ఇది వ‌ర‌కు `బిల్లా` మరియు 'రెబ‌ల్' సినిమాలో వీరిద్ద‌రూ తెర‌పై క‌నిపించి, అభిమానుల్ని అల‌రించారు. బిల్లా ఆ సినిమాకీ కృష్ణంరాజునే నిర్మాత‌. ఇప్పుడు మ‌రోసారి రెబ‌ల్ స్టార్లిద్ద‌రూ సంద‌డి చేయ‌బోతున్నార‌న్న‌మాట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS