గ్లామరే కాదు, అంతకు మించిన 'నిధి' నిక్షేపాలున్నాయ్‌.!

మరిన్ని వార్తలు

రెండు సినిమాల్లో నటించినా, ఆ రెండు సినిమాలకు రాని టాక్‌ ఈ సినిమాతో సంపాదించేసింది విడుదలకు ముందే ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌. గ్లామర్‌ విషయంలో నిధి మొదట్నుంచీ టాప్‌ లెవల్‌లోనే ఉంది. కానీ, ఇప్పుడు ఇస్మార్ట్‌ గాళ్‌ అయ్యాకా, ఆ డోస్‌ ఇంకాస్త పెంచేసింది. సినిమాలో నిధి అగర్వాల్‌ గ్లామర్‌ డోస్‌ ఏ రేంజ్‌లో ఉందో ప్రోమోస్‌ చెప్పకనే చెప్పేస్తున్నాయి. ఇదంతా జస్ట్‌ ట్రైలే అయినా, సినిమాలో ఈ డోస్‌ ఎంత మాత్రమూ తగ్గకుండా ఉంటుందని సంకేతాలు అందుతున్నాయి.

 

ఎందుకంటే అక్కడున్నది పూరీ జగన్నాధ్‌. హీరోయిన్స్‌ గ్లామర్‌ని ఏ రేంజ్‌లో చూపించాలో ఆయనకి కొన్ని ఐడియాలున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే, నిధి అగర్వాల్‌ కనిపించేటంత అమాయకురాలేం కాదండోయ్‌. కౌంటర్లు కూడా గట్టిగానే పేలుస్తోంది. ఈ మధ్య సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలిస్తున్న నిధి అగర్వాల్‌, ఓ కొంటె నెటిజన్‌ వేసిన ప్రశ్నలో భాగంగా 'మీలో గ్లామర్‌ మాత్రమేనా? పర్‌ఫామెన్స్‌లో విషయమేమైనా ఉందా?' అని అడిగిన ప్రశ్నకు అస్సలు తడబడకుండా, నువ్వు ట్రైలరే చూశావ్‌.. సినిమా చూసి మాట్లాడు..' అని సెటైర్‌ వేసి, సదరు నెటిజన్‌ నోరు మూయించేసింది.

 

చూశారా.. మన అందాల నిధి గడుసుతనం. ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ న్యూరో సర్జన్‌గా కనిపించనుంది. హుందాగా కనిపిస్తూనే, కావల్సిన గ్లామర్‌ పండించిందీ హాట్‌ బ్యూటీ. రామ్‌తో నిధి కెమిస్ట్రీ పిచ్చ పిచ్చగా కిక్కెక్కిస్తోంది. ట్రైలర్స్‌కే ఇంతలా మాట్లాడుకునేలా చేసింది ఈ భామ. ఇక సినిమా రిలీజయ్యాక ఇంకెంత మాట్లాడిస్తుందో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS