బాస్ లేడీని మిస్సవుతున్నానంటూ ఇటీవల నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో డైరెక్ట్‌గా ఛార్మికే ట్వీట్ చేస్తూ తన ఆవేదనను వెల్లగక్కింది. 'మిస్ అవడమెందుకు, గోవాకి వచ్చెయ్..' అంటూ బాస్ లేడీ ఛార్మి చెప్పేసరికి, ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ మరో ఆలోచన లేకుండా గోవాలో వాలిపోయిందేమో.! ''స్పెంట్ మై ఆఫ్ డే విత్ మై ఫేవరెట్స్ ఇన్ గోవా' అంటూ బాస్ లేడీ ఛార్మితోపాటు, ఇస్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో వున్న ఓ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది నిధి అగర్వాల్. అయితే, ఈ ఫొటో కొత్తది కాదు, ఓల్డ్ ఫొటో.. అంటూ అభిమానులే ఆమెకు డైరెక్ట్‌గా స్పష్టం చేసేస్తున్నారు.
గతంలో 'ఇస్మార్ట్ శంకర్' షూటింగ్ సమయంలో నిధి అగర్వాల్ ఇదే తరహా కాస్ట్యూమ్స్‌తో కన్పించింది. ఇప్పుడూ అదే కాస్ట్యూమ్స్‌తో కన్పించడంతో అది పాత ఫొటోగానే అంతా భావిస్తున్నారు. అయితే, నిధి మాత్రం ఛార్మితోనూ, దర్శకుడు పూరి జగన్నాథ్‌తోనూ వున్న స్నేహం కారణంగా నిజంగానే గోవాకి వెళ్ళిందని 'రొమాంటిక్' టీమ్ అంటోంది. ప్రస్తుతం 'రొమాంటిక్' సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. పూరి ఆకాష్, కేతిక శర్మ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ పాడూరి ఈ చిత్రానికి దర్శకుడు. రమ్యకృష్ణ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కన్పించనున్న విషయం విదితమే.