రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ స్టామినా ఇదీ.!

మరిన్ని వార్తలు

'సాహో' సినిమాకి డిజాస్టర్‌ టాక్‌ వచ్చినా.. అందర్నీ విస్మయ పరిచే స్థాయిలో వసూళ్లను సాధించింది. అయినాగానీ, ఆ సినిమా బయ్యర్లకు నష్టాల్ని మిగిల్చిందనుకోండి.. అది వేరే విషయం. ఆ సంగతి పక్కన పెడితే, ప్రభాస్‌ తన తాజా చిత్రం 'జాన్‌' (వర్కింగ్‌ టైటిల్‌) అప్‌డేట్‌ రేపు ఇవ్వబోతున్నాడన్న వార్త ఒక్కసారిగా రెబల్‌ స్టార్‌ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. నిజానికి ప్రభాస్‌ అభిమానులు, ఈ సంక్రాంతికే సర్‌ప్రైజ్‌ని ఆశించారు. అయితే, మేకర్స్‌ కాస్త ఆచి తూచి వ్యవహరించినట్లున్నారు అప్‌డేట్‌ని విడుదల చేయడంలో.

 

రేపు ఈ సినిమా అప్‌డేట్‌ రాబోతోంది. అదేంటి.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. టైటిల్‌ విడుదల చేస్తారని కొందరు.. కాదు కాదు, టైటిల్‌తోపాటు హీరో హీరోయిన్లతో ఓ పోస్టర్‌ రిలీజ్‌ అవుతుందని మరికొందరు.. ఇలా రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రభాస్‌ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా చేస్తోన్న విషయం విదితమే. 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. తొలుత 'సాహో' స్థాయిలోనే భారీ బడ్జెట్‌తో ప్లాన్‌ చేసినా.. ఆ తర్వాత కొన్ని మార్పులు చేసి.. బడ్జెట్‌ని గణనీయంగా తగ్గించినట్లు 'జాన్‌' సినిమా విషయమై ప్రచారం జరుగుతోంది. అయితే, చిత్ర యూనిట్‌ వర్గాలు మాత్రం.. ఎక్కడా ఏ విషయంలోనూ రాజీ పడలేదని అంటున్నాయి. మొత్తమ్మీద, ప్రభాస్‌ కొత్త సినిమా అప్‌డేట్‌కి సంబంధించిన న్యూస్‌.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వేల కొద్దీ ట్వీట్లు కన్పిస్తున్నాయి ప్రభాస్‌ అభిమానుల నుంచి. అదీ ప్రభాస్‌ స్టామినా అంటే.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS