గ్లామ్‌షాట్‌: కట్‌ చేసి.. వదిలేసి.. అంతలా కవ్విస్తే..!

మరిన్ని వార్తలు

అందం వేరు, ఆకర్షణ వేరు. అందంగా ఉన్న ప్రతీ ఒక్కరూ ఆకర్షణీయంగా కనిపించాలనేం లేదు. అలా అని అందంగా లేకపోయినా విపరీతంగా ఆకర్షిస్తుంటారు కొందరు. ఇక అందాల భామ నిధి అగర్వాల్‌ తీరే వేరు. అందానికీ, ఆకర్షణకూ కేరాఫ్‌ అడ్రస్‌ ఈ భామ. ఏ ఎక్స్‌ప్రెషన్‌ లేకున్నా, క్యూట్‌ అప్పీల్‌తో పిచ్చెక్కిస్తుంటుంది. ఏ మేకప్‌ లేకపోయినా అందంగా కనిపించడమే ఆమె ప్రత్యేకత. ప్రస్తుతం 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాలో నటిస్తోంది. అంతకు ముందే 'సవ్యసాచి', 'మిస్టర్‌ మజ్ను' సినిమాల్లో నటించింది. కానీ సక్సెస్‌ అందుకోలేకపోయింది. సక్సెస్‌తో సంబంధం లేకున్నా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 

ఇక సోషల్‌ మీడియాలోనూ కావల్సినంత ఫాలోయింగ్‌ సంపాదించింది. ఆ ఫాలోయింగ్‌తోనే అప్పుడప్పుడూ ఇదిగో ఇలా హాట్‌ హాట్‌ పిక్స్‌ పోస్ట్‌ చేస్తుంటుంది. ఇదిగో ఈ తాజా పిక్‌ చూశారుగా. డెనిమ్‌ విత్‌ మోడ్రన్‌ ఎల్లో టాప్‌లో వయ్యారంగా ఇచ్చిన పోజు సమ్‌థింగ్‌ డిఫరెంట్‌గా ఎట్రాక్ట్‌ చేస్తోంది. చెవులకున్న పెద్ద పెద్ద రింగులు. చేతికి ఉన్న ఉంగరం ఆమె అందాన్ని మరింత ఎలివేట్‌ చేస్తుండగా, ఒక చేతిని పోకెట్‌లో ఉంచి, ఇంకో చేతిని వయ్యారంగా అలా పైకెత్తి సుతారంగా బుగ్గకు ఆనించి పోత పోసిన మోడ్రన్‌ శిల్పంలా కనిపిస్తోంది హాట్‌ హాట్‌ అందాల 'నిధి'.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS