మహేష్ బావ గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ ఓ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వార్త పాతదే. కానీ, అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌ని గల్లా అశోక్ పట్టాలెక్కించనున్నాడట. ఈ చిత్రాన్ని తండ్రి గల్లా జయదేవ్ నిర్మించనున్నారనీ తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివరాలు రానున్నాయి. 'భలే మంచి రోజులు' ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకి దర్శత్వం వహించనున్నాడు.
ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించనుందని తెలుస్తోంది. అశోక్ డెబ్యూ హీరో కావడంతో, నిధి అగర్వాల్‌కి ఓ మోస్తరు క్రేజ్ ఉండడంతో, ఈ ప్రాజెక్ట్‌కి నిధి ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. ఆమె అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చి ఈ సినిమాలో నటింపచేసే దిశగా చర్చలు సాగుతున్నాయట. ఒకవేళ అదే నిజమైతే, నిధి అగర్వాల్‌కి తన ఇమేజ్‌ని క్యాష్ చేసుకోవడం ఎలాగో తెలిసినట్లే.
అయితే, ఈ ధోరణి అన్ని వేళలా పనికి రాదు. మరోవైపు మాస్ ఇమేజ్ ఉన్న రామ్ వంటి హీరోతో 'ఇస్మార్ట్ శంకర్' వంటి సూపర్ హిట్ తన ఖాతాలో ఉన్న నిధి అగర్వాల్ ఓ డెబ్యూ హీరో ప్రాజెక్ట్‌లో నటించడం అంటే ఆమె ఫ్యాన్స్ మరోలా భావిస్తున్నారు. కానీ, ప్రస్తుతం నిధి చేతిలో ఏ తెలుగు ప్రాజెక్టూ లేదు. సో ఉన్నంతలో ఇది ఆమెకి బంపర్ ఆఫరే అని చెప్పక తప్పదు.