సినిమా వాళ్ల పార్టీలంటేనే మందు - చిందు కామన్. కాకపోతే... అప్పుడప్పుడూ ఆ వినోదం కాస్త శ్రుతిమించుతుంటుంది. పీకల్దాకా తాగి - ఇష్టం వచ్చినట్టు వాగి - ఆ వాతావరణాన్ని కాస్త కలుషితం చేస్తుంటారు కొంతమంది. ఈమధ్య అదే జరిగింది. పరిశ్రమలోని కొంతమంది మిత్రులు కలిసి చేసుకున్న ఓ పార్టీలో యాంకరమ్మ నానా బీభత్సం సృష్టించింది. ఫుల్లుగా తాగి, ఇష్టం వచ్చినట్టు వాగి, అక్కడే పడిపోయింది.
పూర్తి మైకంలో ఉన్న ఆ యాంకరమ్మని మరో ఇద్దరు ఇంటి దగ్గర దింపి రావాల్సివచ్చిందట. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ నడుస్తోంది. బుల్లి తెరపై ఆమెకు భలే క్రేజ్ ఉంది. సినిమాల్లోనూ నటించింది. ఇటీవలే యాంకరింగు కంటే, నటన, సినిమాలపై దృష్టి పెట్టిన ఈ భామ.. ఓ యువ దర్శకుడితోనూ చాలా క్లోజ్‌గా ఉంటుందని తెలిసింది. ఆయన ఇచ్చిన పార్టీలోనే ఇదంతా జరిగిందని చెవులు కొరుక్కుంటున్నారు.