క్రికెటర్‌తో డేటింగ్‌ విషయంలో క్లారిటీ ఇచ్చిన హాట్‌ బ్యూటీ!

మరిన్ని వార్తలు

హాటెస్ట్‌ హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ తాజాగా మంచు లక్ష్మి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'ఫీట్‌ అప్‌ విత్‌ స్టార్స్‌' ప్రోగ్రాంలో పాల్గొంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఆసక్తికరరంగా, స్టార్స్‌ బెడ్‌ టైమ్‌ స్టోరీస్‌ని బయట పెడుతోంది మంచు లక్ష్మి. అందులో భాగంగా నిధి అగర్వాల్‌ని ఇంటర్వ్యూ చేసిన మంచు లక్ష్మి ఆమెకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టింది. ఇంతకీ అదేంటంటే, నిధి అగర్వాల్‌ చేసిన సినిమాలు తక్కువే అయినా, రూమర్స్‌ గట్టిగానే మూట కట్టుకుంది.

 

క్రికెటర్‌ రాహుల్‌తో నిధి అగర్వాల్‌ డేటింగ్‌లో ఉందంటూ ఈ మధ్య నిధి అగర్వాల్‌పై రూమర్స్‌ చక్కర్లు కొట్టాయి. అయితే, గతంలోనే వీటిని క్రికెటర్‌ రాహుల్‌ ఖండించాడు. తాజాగా నిధి అగర్వాల్‌ కూడా అదే చెప్పింది. రాహుల్‌ తనకు మంచి స్నేహితుడు మాత్రమే. ఇండియా - పాకిస్థాన్‌ మ్యాచ్‌ టైంలో రాహుల్‌ని ఒకసారి కలిశాను. అప్పటి నుండీ అతనితో స్నేహం ఏర్పడింది.

 

అంతే, మా మధ్య ఇంకెలాంటి సంబంధం లేదు. జస్ట్‌ బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అంతే.. అని చెప్పుకొచ్చింది. అఫ్‌ కోర్స్‌ సహజంగా రూమర్స్‌ ఎందుర్కొంటున్న అందాల భామలు అందరూ చెప్పే మాట ఇదే.. కొంచెం కొత్తగా చెప్పమ్మా అందాల నిధుల బొమ్మా..' అంటూ నెటిజన్స్‌ స్వీట్‌ స్వీట్‌గా కామెంట్స్‌ పెడుతున్నారు. అబ్బా.. ఆశ, దోశ.. అలా అడిగితే మాత్రం చెప్పేస్తారా.? ఏంటీ.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS