నిధి అగర్వాల్‌ చితక్కొట్టేస్తోంది!

మరిన్ని వార్తలు

ఓ బొమ్మ మీదికెక్కి బాక్సింగ్‌ గ్లౌజ్‌తో తెగ చితక్కొట్టేస్తోంది అందాల భామ నిధి అగర్వాల్‌. ప్రొఫిషనల్‌ స్టంట్‌ మాస్టర్‌లా ఆవేశంగా పిచ్చ కొట్టుడు కొట్టేస్తోంది. అసలింతకీ నిధికి ఎందుకంత కోపం వచ్చింది ఆ బొమ్మపై.? ఎవరి మీదనో కసి ఆ బొమ్మ మీద తీర్చుకుంటుందా.? అంతలా చితక్కొట్టేసేంత కసి ఈ పాల బుగ్గల ముద్దుగుమ్మకు ఎవరిపై ఉందో తెలీదు.. కానీ ఈ చితక్కొట్టుడు వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్‌ అయిపోతోంది. వివరాలు పూర్తిగా తెలియవు కానీ, వీడియోలో నిధి అగర్వాల్‌ చితక్కొట్టుడు చూసి ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు.

 

సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ పిక్స్‌తో రెచ్చిపోయే నిధి అగర్వాల్‌ ఎందుకింత వైలెంట్‌గా మారిపోయిందో అర్ధం కావడం లేదు నెటిజన్స్‌కి. ఎప్పటికప్పుడే వర్కవుట్స్‌ చేస్తూ, హాట్‌ హాట్‌ ఫోటో సెషన్స్‌ చేయించుకుంటూ ఆ ఇన్‌ఫర్మేషన్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుంది. ఆ హాట్‌నెస్‌కి నెటిజన్లు ఆల్వేస్‌ ఫిదా అయిపోతుంటారు. కానీ కొంచెం కొత్తగా ఈ సారి ఇదిగో ఇలా డిఫరెంట్‌ యాక్షన్‌తో కనిపించి, సరికొత్తగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రస్తుతం నిధి అగర్వాల్‌ 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్‌తో పాటు నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పూరీ జగన్నాధ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌లో రూపొందుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS