టీజర్‌ టాక్‌: 'రాక్షసుడు' ఎవరు?

By iQlikMovies - June 01, 2019 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

ఇటీవల 'సీత' సినిమాలో రాముడు మంచి బాలుడుగా కనిపించిన బెల్లంకొండ శ్రీనివాస్‌ ఇప్పుడు 'రాక్షసుడు' సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా తమిళ బ్లాక్‌ బస్టర్‌ 'రాక్షసన్‌'కి రీమేక్‌గా రూపొందుతోంది. అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. లేటెస్ట్‌గా ఈ సినిమా టీజర్‌ విడుదల చేశారు. టీజర్‌లో థీమ్‌ని బాగానే రివీల్‌ చేశారు. నగరంలో అంతు చిక్కని రీతిలో టీనేజ్‌ అమ్మాయిల హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలకు కారణం ఎవరనేది అర్ధం కాదు.. ఆ విచారణలో భాగంగా ఈ హత్యలన్నింటికీ కారణం ఓ సైకో అనీ, ఆ సైకో కిల్లర్‌కి సోషల్‌ యాంటీ డిజార్డర్‌ ఉందనీ డాక్టర్‌ ద్వారా తెలుసుకుని, షాకవుతాడు హీరో.

 

ఆ వ్యక్తి గురించి నమ్మశక్యం కాని మరికొన్ని షాకింగ్‌ విషయాల్ని తెలుసుకున్న హీరో ఆ రాక్షసున్ని ఎలా సంహరించాడు. ఆ రాక్షసుని బారి నుండి సిటీలోని అమ్మాయిల్ని ఎలా కాపాడాడు.? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఒరిజినల్‌లోని డెప్త్‌, ఇంటెన్సిటీని అలాగే ఈ రీమేక్‌లో క్యారీ చేసినట్లు కనిపిస్తోంది టీజర్‌ చూస్తుంటే. చాలా ప్రామిసింగ్‌గా టీజర్‌ని కట్‌ చేశారు. చాలా సైకో కిల్లర్‌ సినిమాలు వచ్చాయి. కానీ, చాలా రోజుల తర్వాత అసలు సిసలు క్రైమ్‌ థ్రిల్లర్‌ ఫీల్‌నిచ్చింది 'రాక్షసుడు' టీజర్‌. ఇంతకీ టీజర్‌లో ఆ రాక్షసుడు ఎవరనే విషయాన్ని రివీల్‌ చేయలేదు. ఓ పాప బొమ్మను భయంకరంగా డిజైన్‌ చేసి, ప్రధానంగా చూపించారు. రమేష్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS