నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో ఓ హాట్ వీడియో పోస్ట్ చేసింది. 'హాట్ బ్రేక్ ఫాస్ట్' అంటూ హ్యాష్‌టాగ్ కూడా జోడించింది. అయితే ఏంటీ వీడియో కథా కమామిషు అంటే, రెండు చేతుల్లోనూ బరువులు పట్టుకుని స్లోగా వాక్ చేస్తోంది నిధి అగర్వాల్ ఈ వీడియోలో. పొట్టి నిక్కరేసుకుని, నిధి అలా బరువులు మోస్తుంటే, చూస్తున్న అభిమానులకు డబుల్ ధమాకాలానే ఉంది. అయితే అందాల భామలు ఇలా బరువులు ఎత్తితే కుర్రకారుకు కాస్త కష్టమే కదా.
పొద్దు పొద్దున్నే బరువులు మోస్తున్న నిధి అగర్వాల్‌ని చూసి అభిమానులు కూడా అదే ఫీలవుతున్నారు. ఎప్పుడూ ఫిట్‌గా ఉండే నిధీ.. నీకెందుకంత బరువు బాధ్యత. అనవసరంగా ఎందుకలా నీ శరీరాన్ని కష్టపెట్టేస్తావ్.. వద్దమ్మా వద్దు.. అంటూ నెటిజన్లు ఈ క్యూట్ హాటీకి స్వీట్ సజిషన్స్ ఇచ్చేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల కాళ్లకూ, చేతులకూ టోటల్ బాడీకి చాలా మంచిదట. కనబడకుండానే బాడీలో అనవసరంగా పేరుకుపోయే బ్యాడ్ కొలిస్టరాల్‌ని ఈ వ్యాయామంతో కరిగించుకోవచ్చట.
తద్వారా హెల్దీగా ఉండొచ్చనేది నిధి చెబుతున్న గ్లామర్ చిట్కా. ఏది ఏమైతేనేం. ఈ వీడియోకి వస్తున్న రెస్పాన్స్ అయితే సూపర్బ్‌గా ఉంది మరి. ఎందుకుండదులెండి.. వర్కవుట్ పేరు చెప్పి, అంత హాట్ హాట్‌గా విస్తరేయకుండానే అందాల వడ్డన జరుగుతోందిక్కడ. అలాంటప్పుడు ఆ రెస్పాన్స్ ఉండాలి మరి. ఇకపోతే, ప్రస్తుతం నిధి 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Lunges for breakfast 💁🏻♀️ pic.twitter.com/xfgVy7W2wK
— Nidhhi Agerwal (@AgerwalNidhhi) May 8, 2019