గ్లామర్‌ కన్నా గుణం మిన్న అంటోన్న బ్యూటీ.!

మరిన్ని వార్తలు

దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న నానుడి హీరోయిన్ల విషయంలో బాగా వర్కవుట్‌ అవుతూ ఉంటుంది. క్రేజ్‌ ఉన్నప్పుడు వాడుకోవాలి. అందినప్పుడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ మాత్రం వెరీ డెడికేటెడ్‌ అమ్మాయండోయ్‌. ఇంతకీ నిధి ఏం చేసిందనే వివరాల్లోకి వెళితే, ఓ బ్యూటీక్రీమ్‌కి సంబంధించి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించాల్సిన ఆఫర్‌ వస్తే సున్నితంగా తిరిస్కరించేసిందట. ఎందుకంటారా.? ఆ బ్యూటీ క్రీమ్‌పై తనకే నమ్మకం లేదట. అందుకే.

 

అయ్యో అలా చేసిందా.? నమ్మకం ఉంటే ఏంటీ.? లేకుంటే ఏంటీ.? సంపాదన కోసం అలాంటివి ముద్దుగుమ్మలకు తప్పవు కదా అనుకుంటే ఈ ముద్దుగుమ్మ విషయంలో పొరపాటే. తనకే నమ్మకం లేని ప్రొడక్ట్‌పై జనాల్ని నమ్మమని ఎలా ప్రచారం చేస్తాను.? అని తిరిగి అడుగుతోంది నిధి అగర్వాల్‌. డబ్బులు సంపాదించడానికి సవాలక్ష మార్గాలుంటాయి. కానీ జనాన్ని ఛీటింగ్‌ చేసి సంపాదించాల్సిన అవసరం తనకు లేదంటోంది. నిజంగా ఎంత మంచిదో కదా నిధి అగర్వాల్‌. 

 

'సవ్యసాచి' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన ఈ బ్యూటీ త్వరలో 'మిస్టర్‌ మజ్ను' సినిమాతో రాబోతోంది. ఇదిలా ఉంటే, ఎక్స్‌పోజింగ్‌ సంగతేమని అడిగితే, ఎక్స్‌పోజింగ్‌ అనేది ప్రొఫిషన్‌లో ఓ భాగం. కథని బట్టి, సన్నివేశాన్ని బట్టి డైరెక్టర్‌ ఎలా చెబితే అలా చేయడం ఓ నటిగా తన బాధ్యత అంటోంది నిధి అగర్వాల్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS