మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి అనే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నిహారిక కొణిదెల. ఆమె ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా చేస్తుండగా ఇప్పుడు మరొక తెలుగు సినిమా రూపంలో ఒక మెగా ఆఫర్ ఆమె దక్కించుకుంది.
ఆ వివరాల్లోకి వెళితే, చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రానికి సంబంధించి కొన్ని పుకార్లు బయటకి వస్తున్నాయి. ఆ పుకార్లు ఏంటంటే- సైరా చిత్రంలో నిహారికకి ఒక ముఖ్యపాత్ర లభించినట్టుగా తెలుస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రం పైన భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ అంశం గురించి ఇటు నిహారిక గాని అటు కొణిదెల ప్రొడక్షన్స్ గాని స్పందించాల్సి ఉంది. ఇక ఇదే గనుక జరిగితే పెదనాన్నతో కలిసి నటించే అవకాశం దక్కించుకున్నందుకు మంచి అదృష్టవంతురాలు నిహారిక అని చెప్పొచ్చు.
ఏదైతేనేమి.. మెగా బిడ్డకి ఒక మంచి మెగా ఆఫర్ వచ్చింది ఈ చిత్రం రూపంలో...