మెగా డాటర్ నిహారిక పెళ్లి గరించి ఈ మధ్య చాలా గాసిప్స్ వచ్చాయి. యంగ్ హీరో నాగశౌర్యతో నిహారిక పెళ్లని చాలా పెద్ద రచ్చ జరిగింది. 'ఒక మనసు' సినిమా టైంలో జరిగిన రచ్చ ఇది. అయితే ఆ రూమర్‌ని ఇటు నాగశౌర్య, అటు నిహారిక ఇద్దరూ ఖండించారు.
అయినా నిహారిక పెళ్లి రూమర్స్ ఆగలేదు. ఆ తర్వాత మెగా మేనల్లుడు తేజుతో నిహారిక పెళ్లంటూ మరోసారి రాద్ధాంతం మొదలెట్టారు. అందులో కూడా వాస్తవం లేదు. తేజ, నిహారిక ఒకే ఇంట్లో పెరిగారు. జస్ట్ ఫ్రెండ్స్‌లా, బ్రదర్ అండ్ సిస్టర్లా మాత్రమే మా మధ్య చనువు ఉంది తప్ప, పెళ్లి చేసుకునేంత చనువు లేదు అని తేజు, నిహారిక ఈ రూమర్‌ని ఖండించారు. ఇలా నిహారిక పెళ్లి గురించి ఈ మధ్య ఏ హీరోయిన్ విషయంలోనూ జరగనంత రచ్చ జరిగిందనే చెప్పాలి.
ఇక తాజాగా నిహారిక తన పెళ్లి గురించి స్పందించింది.ఈ సారి కొంచెం ఘాటుగానే స్పందించింది. 'నిహారిక పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది? ఎవరితో చేసుకుంటుంది? అంటూ మీ ప్రమోషన్స్ కోసం నా పెళ్లి న్యూస్ వాడుకోవడం తప్ప మీకు వేరే పనేం లేదా? అంటూ కాస్త ఎక్కువగానే గుస్సా అయిన వీడియో ఒకటి నెట్టింట్లో సందడి చేస్తోంది. అయితే ఈ సారి నిహారిక గుస్సాకి రీజన్ వేరే ఉందిలెండి.
స్వామి కార్యం సుకార్యం రెండూ ఒక్కసారే పూర్తయినట్లుగా ఈ వీడియోతో ఇటు సినిమా ప్రమోషన్ జరిగిపోతోంది. అటు నిహారిక పెళ్లి గురించి కొంచెం గట్టి కౌంటర్ ఇవ్వడానికి బాగా ఉపయోగపడింది. ఇంతకీ ఏం సినిమా అనుకుంటున్నారా? అదేనండీ నిహారిక, సుమంత్ అశ్విన్ జంటగా 'హ్యాపీ వెడ్డింగ్' చిత్రం తెరకెక్కుతోంది కదా.
ఇది నిహారిక ప్లానింగో, లేక 'హ్యాపీ వెడ్డింగ్' సినిమా టీమ్ ప్లానింగో కానీ ప్రమోషన్ అయితే అదిరిపోయింది.