గుంటూరు అబ్బాయితో పెళ్లి?

మరిన్ని వార్తలు

మెగా డాట‌ర్ నిహారిక పెళ్లి చేసుకోబోతోందా? గ‌త కొంత‌కాలంగా ఈ వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఓ హీరోతో చాలా క్లోజ్ గా ఉంటుంద‌ని, త‌న‌నే పెళ్లి చేసుకోబోతోంద‌ని క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకున్నారు. అయితే వీటిపై నిహారిక ఎప్పుడూ స్పందించ‌లేదు. అయితే ఇప్పుడు మాత్రం నిహారిక పెళ్లికి రెడీ అంటోంది. త‌న పెళ్లి కూడా ఖాయ‌మైపోయింద‌ని టాక్‌.

 

గుంటూరు అబ్బాయిని నిహారిక పెళ్లి చేసుకోబోతోంద‌ని, ఇది పెద్దలు కుదిర్చిన వివాహ‌మే అని టాక్‌. దానికి తోడుగా... నిహారిక నిన్న ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. మిస్ నిహారిక అని కాఫీ క‌ప్పుపై రాసి, అందులో మిస్ కొట్టేసి.. మిస్ట్ర‌స్ అంటూ.. జోడించింది. దాంతో నిహారిక మిస్ నుంచి మిసెస్ గా మార‌బోతోంద‌న్న వార్త‌కు మ‌రింత బ‌లం చేకూరింది. `ముద్ద‌ప‌ప్పు ఆవ‌కాయ్‌` లాంటి వెబ్ సిరీస్‌ల‌తో అల‌రించింది నిహారిక‌. కొన్ని సినిమాలు చేసినా.. హిట్టు అంద‌లేదు. అందుకే ఇప్పుడు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామ‌నుకుంటోంది. మ‌రి కొద్ది రోజుల్లో నిహారిక పెళ్లికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Uh.. what?

A post shared by Niharika Konidela (@niharikakonidela) on


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS