మెగా ఫ్యామిలీ నుండి ఇంతవరకూ చాలా మంది హీరోలు తెరంగేట్రం చేశారు. క్లాస్ అండ్ మాస్ ఇమేజ్‌తో హీరోలుగా తమ సత్తా చాటుతున్నారు. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మొట్టమొదటి హీరోయిన్ నిహారిక.
తొలి సినిమా 'ఒక మనసు'తో అభిమానుల్ని చాలా నిరాశపరిచింది. హీరోయిన్‌గా ఆ పాత్రకు సరిపడా న్యాయం చేసినా, కథ ఎంపికలో నిహారిక కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదనీ తొలి సినిమా విషయంలో విమర్శలు అందుకుంది. దాంతో రెండో సినిమా విషయంలో చాలా గ్యాప్ తీసుకుంది. ఆచి తూచి కథలను ఎంచుకుంటోంది. ఈ మధ్యనే నిహారిక వరుసగా కొత్త సినిమాలకు సైన్ చేస్తోంది.
అందులో భాగంగా తాజాగా నిహారిక, నిర్వాణ సినిమాస్ బ్యానర్‌లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతోంది. ఫైట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రణీత్ అనే ఓ యంగ్ డైరెక్టర్ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. కాగా ఆల్రెడీ నిహారిక మరో సినిమాలోనూ నటిస్తోంది. శ్రియ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నిహారిక కీలక పాత్ర పోషిస్తోంది. లేటెస్టుగా ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.
ఓ వైపు రాహుల్ విజయ్‌తో సినిమా, మరోవైపు శ్రియతో సినిమాను ఏకకాలంలో పూర్తి చేసే యోచనలో నిహారిక ఉందట. ఇవి కాక మరికొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయట. ఇకపై హీరోయిన్‌గా వరుస సినిమాలతో బిజీ కావాలన్నదే మెగా డాటర్ నిహారిక ఆలోచనట.