మెగా డాటర్ నిహారిక త్వరలోనే పెళ్లి కూతురు కాబోతోంది. చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి చేయాలని ఇరు కుటుంబ సభ్యులూ నిర్ణయించుకున్నారు. చైతన్య ఫొటోల్ని కూడా నిహారిక సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ యేడాదే వీళ్ల పెళ్లి కూడా ఖాయం అనుకున్నారు.
అయితే.. నిహారిక - చైతన్యల పెళ్లి ఈ యేడాది చేయర్ట. వచ్చే యేడాది నిర్వహిస్తార్ట. పెళ్లి కూడా చాలా సింపుల్గా చేస్తార్ట. త్వరలోనే నిశ్చితార్థం నిర్వహిస్తారని, కేవలం ఈ వేడుకకు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి హడావుడీ, హంగూ లేకుండా సింపుల్ గా పెళ్లి చేయాలని నాగబాబు భావిస్తున్నారు. సెలబ్రెటీల ఇంట్లో వేడుకలంటే... చాలా హంగామా ఉంటుంది. పెళ్లంటే.. సంగీత్ లాంటి హంగామా తప్పకుండా కనిపిస్తుంది. అయితే నిహారిక పెళ్లికి మాత్రం ఇవేం ఉండవు. కరోనా టైమ్ కదా. ఏం చేస్తాం???